*రాబోయే రోజుల్లో విఎంఆర్డీఎకు పూర్వ వైభవం మంత్రి ముత్తంశెట్టి

 





*రాష్ట్రంలో 12 పర్యాటక ప్రాంతాలలో అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులకు మౌలిక సదుపాయాలు

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడి

     విశాఖపట్నం, సెప్టెంబర్, 9: రాబోయే రోజుల్లో విఎంఆర్డీఎకు పూర్వ వైభవం తీసుకురానున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు.  బుధవారం విఎంఆర్డీఎ సమావేశ మందిరంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  రియల్ ఎస్టేట్ లో విఎంఆర్డీఎకు మూడు, నాలుగు దశాబ్దాల నుండి ఒక మంచి పేరు ఉందన్నారు. మూడు జిల్లాల్లో మంచి లేఅవుట్లు వేసి, ప్రభుత్వానికి ఆదాయం తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో విఎంఆర్డీఎ తరఫున చేపట్టిన కార్యక్రమాలను పారదర్శకంగా, ఎలాంటి బందుప్రీతి లేకుండా కార్యక్రమాలు చేపడుతుందని చెప్పారు. విఎంఆర్డీఎ, పర్యాటక శాఖలలో పెండింగ్ లో ఉన్న ఎన్ఎడి పై వంతెన, వివిధ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రేవు పోలవరం, యారాడ, తంతడి, పూడిమడక, తదితర బీచ్ ల్లో పర్యాటక ప్రాంతాలను గుర్తించి పిపిపి మోడ్ లో అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు. ఆర్కియాలజీకి సంబందించి తొట్లకొండ, బావికొండ, పావురాలకొండలకు బద్దిస్టులు  వచ్చి ద్యానించుకొనే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు.  పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ఆదాయం పెంచే దిశలో చర్యలు తీసుకుంటామన్నారు. టూరు ఆపరేటర్లు, ట్రావెల్స్ అండ్ టూరు ఆపరేటర్లు టూరిజంనకు సంబంధించిన కార్యక్రమాలు చేయాలంటే తప్పనిసరిగా పర్యాటక శాఖలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకొని లైసెన్సు పొందాలని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రపంచ పటంలో ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించినట్లు తెలిపారు.  రాష్ట్రంలోని 12 స్థలాల్లో అంతర్జాతీయ స్థాయిలో  సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు.   ఈ సమావేశంలో విఎంఆర్డీఎ కమీషనర్ కోటీశ్వరరావు, గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి, అనకాపల్లి శాసన సభ్యులు గుడివాడ అమర్ నాథ్, తదితరులు పాల్గొన్నారు.