విశాఖపట్నం వారధి న్యూస్ మార్చి 18 పరిశుభ్రతను పాటిద్దాం కరోనా వ్యాధిని కట్టడి చేద్దామంటూ విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ వద్ద బుధవారం ఉదయం సిపిఐ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు
సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ ఇప్పుడు అందరి నోట కరోనా మాట వినిపిస్తోంది అన్నారు. ఈ వ్యాధి నివారణకు వ్యక్తిగత శుభ్రత పరిష్కారానికి ఒక కారణం అన్నారు. ఆల్కహాల్ కలిగిన ద్రవం తో శుభ్రం చేసుకుంటే మంచిదన్నారు . అలాగే దగ్గినప్పుడు తుమ్మిన ప్పుడు చేతి రుమాలు లేదా తువాలు అడ్డు పెట్టుకుంటే కొంతమేర తగ్గించుకొనే అవకాశం ఉంటుందని నర్సింగ్ రావు చెప్పుకొచ్చారు. ఈ ప్రచారంలో లోకనాధం తో పాటు పలువురు సిపిఐ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు
పరి శుభ్రతను పాటిద్దాం కరోనా వ్యాధిని కట్టడి చేద్దాం