రోటరీ క్లబ్  విశాఖ పోర్ట్ సిటీ కంటి ఆపరేషన్ కు  రూ 40,000/- లు  నిధులు విరాళం

 



విశాఖపట్నం 9 సెప్టెంబర్ 2020 : విశాఖపట్నం మహారాణిపేటలో మంగళవారం నాడు రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ ఒక సాధారణ మత్స్యకారుడు యెల్లాజీ యొక్క కంటి ఆపరేషన్ కు రూ 40,000/- నిధులు సమకూర్చారు.  అతను సాధారణ  గ్లో కోమాతో బాధపడుతున్నాడు మరియు జీవనోపాధి పొందలేకపోయాడు. ఈ తరుణంలో రోటరీ క్లబ్ విశాఖ పోర్ట్ సిటీ అధ్యక్షుడు కెప్టెన్ ఆర్ ఎస్ కాళీ  ప్రసాద్, కార్యదర్శి ఆర్టిఎన్ విఠల్ ప్రసాద్, రోటరీ బ్లడ్ బ్యాంక్ కార్యదర్శి రోటేరియన్ రాంబాబు, రోటేరియన్ బగ్గం శ్రీనివాస రావుతో పాటు సభ్యులను సంప్రదించారు.


అధ్యక్షుడు కెప్టెన్ కాశీ ప్రసాద్ మాట్లాడుతూ ఆన్‌లైన్ ఛారిటీ గేమ్ నిర్వహించడం ద్వారా ఈ నిధులు సేకరించారని, ఈ ప్రయోజనం కోసం ఉదారంగా విరాళం ఇచ్చిన రోటరీ సభ్యులకు మరియు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.