: గుడివాడలో భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు

 



పేదల ఇళ్ళపట్టాలను అడ్డుకోవద్దంటూ గుడివాడలో కదం తొక్కిన వైసీపీ శ్రేణులు


భారీ ర్యాలీ,నిరసన ప్రదర్శనలతో అట్టుడికిన పట్టణం


చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమా దిష్టి బొమ్మల దగ్ధం


భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శనలతో అట్టుడికిన పట్టణం


పేదల ఇళ్ళపట్టాలను అడ్డుకోవద్దంటూ గుడివాడలో కదం తొక్కిన వైసీపీ శ్రేణులు భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శనలతో అట్టుడికిన పట్టణం చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమా దిష్టి బొమ్మల దగ్ధం గుడివాడ, సెప్టెంబర్ 9 : పేదల ఇళ్ళపట్టాలను అడ్డుకోవద్దంటూ కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో వైసీపీ శ్రేణులు కదం తొక్కాయి. బుధవారం స్థానిక శరత్ థియేటర్లోని వైసీపీ కార్యాలయం నుండి వేలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరి నెహ్రూచౌక్ సెంటర్‌కు చేరుకున్నారు. నాలుగురోడ్ల కూడలిలో చేపట్టిన నిరసన ప్రదర్శనలతో పట్టణం అట్టుడికింది. గుడివాడ పట్టణంలోకి వచ్చే, పట్టణం మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్ళే వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు నెహ్రూచౌక్ సెంటర్లో నాలుగువైపులా నిలబడి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇళ్ళపట్టాలను అడ్డుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుల దిష్టిబొమ్మలను మహిళలు చెప్పులతో కొట్టారు. లోకేష్, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుల దిష్టిబొమ్మలను మహిళలు చెప్పులతో కొట్టారు. దిష్టిబొమ్మలను కిందపడవేసి కాళ్ళతో ఇష్టానుసారంగా తొక్కుతూ కర్రలతో బాదారు. మహిళలే స్వయంగా దేవినేని ఉమా దిష్టిబొమ్మకు చీర కట్టారు. మూడు దిష్టిబొమ్మలకు నిప్పంటించారు. తగలబడుతున్న దిష్టిబొమ్మల చుట్టూ మహిళలు తిరుగుతూ చంద్రబాబు, లోకేష్, దేవినేని ఉమాలను ఇష్టానుసారంగా తిడుతూ శాపనార్ధాలు పెట్టారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ 70ఏళ్ళ వయస్సు దాటినా చంద్రబాబు బుద్ధి రాలేదంటూ అనేకసార్లు మంత్రి కొడాలి నాని మీడియా సమావేశాల్లో మాట్లాడుతూ వస్తున్నారని, నిజంగానే ఆయనకు బుద్ధి రాలేదన్నారు. సీఎం జగన్మోహనరెడ్డి 30లక్షల ఇళ్ళపట్టాలను మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చే కార్యక్రమాన్ని చంద్రబాబు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. మహిళల ఉ సురు చంద్రబాబుకు తప్పక తగులుతుందన్నారు. 40 ఏళ్ళ ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు తన కొడుకు లోకేష్ ను ఎమ్మెల్యేగా కూడా గెల్పించుకోలేకపోయాడన్నారు. అమరావతిలోనూ పేదలు ఉండడానికి వీల్లేదని లోకేష్ ను ఎమ్మెల్యేగా కూడా గెల్పించుకోలేకపోయాడన్నారు. అమరావతిలోనూ పేదలు ఉండడానికి వీల్లేదని చెబుతున్న చంద్రబాబుకు రానున్న రోజుల్లో తగిన శాస్తి చేస్తామన్నారు. ఇళ్ళపట్టాలను అడ్డుకుంటున్న చంద్రబాబును మహిళలు రాష్ట్రం నుండి తరిమికొట్టే పరిస్థితి దగ్గర్లోనే ఉందన్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమాకు సిగ్గు, శరం లేదన్నారు.