మత్స్య ఉత్పత్తులు ఆహారంగా తీసుకోవడం ద్వారా కోవిడ్ - 19 వైరస్ వ్యాప్తి చెందదు

విశాఖపట్నం  వారధి న్యూస్ ;మత్స్యశాఖ కమీషనర్. భారత ఆహార పరిరక్షణ మరియు ప్రమాణాల సంస్థ, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ప్రభుత్వం వారు కరోనా వైరస్ చికెన్, మటన్ మరియు సముద్ర మత్స్య ఉత్పత్తులను ఆహారముగా తీసుకొనుట ద్వారా కరోనా (కోవిడ్ - 19) వైరస్ వ్యాప్తి చెందదని పత్రికా ప్రకటన జారి చేసి యున్నారు. మత్స్య ఉత్పత్తులను ఆహారంగా తీసుకొనుట ద్వారా కరోనా వైరస్ (కోవిడ్ - 19) వ్యాప్తి చెందుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని కూడా నిర్ధారించడమైనది. భారత ప్రభుత్వము, మత్స్యశాఖ, పశు సంవర్ధక మరియు డైరీ మంత్రిత్వ శాఖ వారు కూడా దేశంలో కోవిడ్ - 19) వైరస్ పరిస్థితి పై అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించుచున్నారు. జంతు ఆరోగ్య సంస్థ వారి శాస్త్రీయ అధ్యయనం ప్రకారం కరోనా (కోవిడ్ - 19) వైరస్ మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాప్తిస్తుందని తెలియజేసినారు మరియు ప్రపంచంలోని ఏ నివేదిక ప్రకారం కూడా కరోనా - 19} వైరస్ మత్స్య ఉత్పత్తులను గాని లేదా వాటి విలువ ఆధారిత ఉత్పత్తులను ఆహారంగా తీసుకొనుట వలన గాని వ్యాప్తి చెందదని భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖకు సమాచారం అందజేసినారు. ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖకు సమాచారం అందజేసినారు. ఈ కారణంగా చేపలు, రొయ్యలు మరియు ఇతర మత్స్య ఉత్పత్తులను ఆహారంగా నివియోగించడం సురక్షితమని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ తెలియజేయుచున్నది. ఈ ప్రాణాంతకమైన కరోనా (కోవిడ్ - 19) వైరస్ సంబంధించి ఆక్వా రైతులు, మత్స్యకారులు మరియు ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావద్దని మత్స్య ఉత్పత్తులను నిరభ్యంతరంగా ఆహారంగా తీసుకోనవచ్చని తెలియజేసారు