కరోనా వైరస్ నివారణకు 20 టీంలు ఏర్పాటు
కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్, చికిత్స లేదన్నారు
జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్
విశాఖపట్నం మార్చి 21 వారధి న్యూస్; జిల్లా అధికారులు, వైద్యాధికారులు జిల్లా స్థాయి లో నోవల్ కరోనా వైరస్ నివారణకు ఉడా చిల్డ్రన్స్ఎరీనాలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు ఏ సందర్భంగా అయన మాట్లాడుతూ కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్, చికిత్స లేదన్నారు,కరోనా ను ఏ విధంగా ఎదుర్కోవాలి, నివారణ చర్యలు, తదితర అంశాలపై టీంలకు దిశా నిర్దేశం చేశారు ఇతర దేశాల నుండి ఎవరైనా వస్తే అలాంటి వారిని క్వారంటైన్ లో ఉంచాలన్నారు కోవిడ్ - 19 అని వాట్సాప్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారుఐసోలేషన్ హాస్పిటల్ కమిటీ అనుమానిత కేసులు చైనా, ఇరాన్, ఫ్రాన్స్, తదితర దేశాల నుండి ఎవరైనా వస్తే అలాంటి వారికి పరీక్షలు నిర్వహించి గుర్తుయించాలన్నారు జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలను ఉంటె డాక్టర్ ని సంప్రదించాలన్నారు ఐసోలేషన్ హాస్పిటల్ లో మాక్ డ్రిల్ నిర్వహించాల్సి ఉందన్నారుఈ ఎన్ టి చెస్ట్, కెజిహెచ్ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాలన్నారు ఐసోలేషన్ ఆసుపత్రుల్లో వసతులు ఏ విధంగా ఉండాలో కమిటీ అన్నింటినీ పరిశీలించాలి ఇఎన్టీ చెస్ట్ కెజిహెచ్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ఐసోలేషన్ వార్డులు తప్పని సరిగా ఉండాలి అన్నారు నగరంలో 4 వేలు వరకు ఐసోలేషన్ వార్డులు సిద్ధంగా ఉంచాలన్నారు కమిటీ ప్రతీ రోజు సర్వెలైన్స్ పై రిపోర్ట్ ఇవ్వాలని పేర్కొన్నారు ఆసుపత్రుల్లో కి అనుమానిత కేసులనుతక్షణమే తరలించాలని కలెక్టర్ ఆదేశించారు ఆంబులెన్స్ పై పాజిటివ్ కేసును తరలించలన్నారు ఐసోలేషన్ వార్డులో శానిటేషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు ప్రతీ ఆసుపత్రి ప్రోటోకాల్ ను పాటించాలన్నారు ఇంజనీరింగ్ కళాశాలలో కూడా క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయవచ్చుఅని తెలిపారు సోమవారం నాటికి 10 వేల బెడ్స్ ఉండాలి అధికారులను ఆదేశించారు 3కిమీ కంటైన్ మెంట్ జోన్ 2కిమీ బఫర్ జోన్ గా గుర్తించలన్నారు టీంలన్నీ సిద్ధంగా ఉండాలి అధికారులను ఆదేశించారు డేటా ఎంట్రీ తక్షణమే కంప్యూటర్ లో నమోదు చేయాలన్నారు ల్యాబ్ సర్వేలెన్స్ కమిటీ శ్యాంపిల్స్ కలెక్షన్ చేసి ల్యాబ్ కు పంపాలన్నారు ప్రతీ కమిటీ రోజు వారీ రిపోర్టు లను ప్రతీ రోజు సాయంత్రం 5 గంటలు కే పంపాలన్నారు ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎల్ శివ శంకర్, ఎం వేణుగోపాల్ రెడ్డి, జివిఎంసి ఇన్ చార్జ్ కమిషనర్ కోటేశ్వరరావు, అదనపు కమీషనర్ తమీమ అన్సారియా, ఐటిడిఏ పిఓ డికె బాలాజీ, సబ్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, డిఎఫ్ఓ సెల్వం, డిఎఫ్ఓ (సోషల్) జ్యోతి, శిక్షణ కలెక్టర్ ప్రతిష్ట, జిల్లా అధికారులు, కమిటీలో ని అధికారులు, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.