విశాఖపట్నం : నిరంతరం మానసిక ఒత్తిడికి లోనయ్యే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు ఆటవిడుపుగా ఈ నెల 22న ఆదివారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ , ఏపి బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్లు సంయుక్తంగా శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది సంబరాలను వైశాఖి జల ఉధ్యానవనంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తున్నట్టు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు , ఎపిడబ్ల్యూజెఎఫ్ నగర శాఖ కార్యదర్శి పి నారాయణ్ లు తెలిపారు. మంగళవారం ఉదయం సీతమ్మధారలోని నార్లభవన్ లో జరిగిన పాతికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సంధర్భంగా పంచాంగ శ్రవణం, కవిసమ్మళనంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే రోజు జర్నలిస్టులకు పంచాంగాలు పంపిణ చేస్తామన్నారు. ఉదయం అల్పాహారంతో ప్రారంభమైన విందు భోజనం వరకు కొనసాగతాయిన్నారు. కావున జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ఏపి బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరావు, అనురాధ, శివప్రసాద్, డి రవికుమార్, కృష్ణవేణి, చిన్నికృష్ణ, ఎంఎఎన్ పాత్రుడు, జి శ్రీనివాసరావు, ఎ సాంబశివరావు, ఆనంద్, ఎంవి రాజశేఖర్, ప్రకాష్, బి రమేష్, రూరల్ కార్యదర్శి ఈశ్వరావు, తదితర్లు పాల్గొన్నారు.
జర్నలిస్టుల ఉగాది సంబరాలు 22న