ఈ నెల 26  ‘శతభేరి’

 


విజయవాడ వారధి న్యూస్; అమరావతి రైతు ల ఉద్యమం ఈ నెల 26 నాటికి 100వ రోజుకు చేరుకోనుంది. అదేరోజు  ‘శతభేరి’ పేరుతో అమరావతిలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు, బహిరంగ సభలు నిర్వహించాలని అమరావతి పరిరక్షణ సమితి(జేఏసీ) మహిళా విభాగం నిర్ణయించింది. గతం లో మాదిరిగానే ఆ రోజు మరల అధిక సంఖ్యలో పోలీస్ బలగాలు మోహరించి అవకాశాలు ఉన్నట్టు తెలుసుతెంది సతభేరి విజయవంతం చేసేందుకు సీపీఐ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని, కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ, టీడీపీ మహిళా నాయకురాలు గద్దె అనురాధ, జనసేన నాయకురాలు ఆర్‌.సౌజన్య, అమరావతి జేఏసీ కన్వీనర్‌ ఎ.శివారెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకొన్నట్లు అమరావతి రైతులు చెప్పుకొంటున్నారు