4 జాతీయ రహదారుల విస్తరణ

అమరావతి: మార్చి 20 వారధి న్యూస్  రాష్ట్రంలో 4 జాతీయ రహదారుల విస్తరణ, ఓ బైపాస్‌ నిర్మాణపనులు త్వరలో మొదలుకానున్నాయి. అధికారులు వీటికి టెండర్లు పిలిచారు.2వారాల్లో ఈప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది.
* కృష్ణా జిల్లాలోని జాతీయ రహదారి-165లో పామర్రు-ఆకివీడు మధ్య 64.4 కి.మీ.మేర రహదారిని విస్తరిస్తున్నారు. ఇందులో గుడివాడ, కైకలూరు వద్ద బైపాస్‌లను నిర్మిస్తారు.

* అనంతపురం జిల్లాలోని జాతీయ రహదారి-544ఇలో మడకశిర నుంచి శిర వరకు 48 కి.మీ. మేర రహదారిని విస్తరించనున్నారు.
* జాతీయ రహదారి-544డిలో భాగంగా అనంతపురం నగర పరిధిలోని సోములదొడ్డి నుంచి మార్కెట్‌యార్డు మీదుగా పాతూరు వరకు 5 కి.మీ. మేర రహదారిని 4 వరుసలుగా విస్తరించనున్నారు.
* విశాఖపట్నం-రాయ్‌పూర్‌ రహదారిలో విజయనగరం జిల్లా పరిధిలో 32 కి.మీ. మేర రహదారిని రూ.155 కోట్లతో విస్తరిస్తున్నారు.
* అనంతపురం జిల్లా కదిరిలో 12 కి.మీ. మేర బైపాస్‌ను కొత్తగా నిర్మించనున్నారు.ఈ బైపాస్‌లో రెండు ఆర్వోబీలు, రెండు వంతెనలు నిర్మిస్తారు.