విశాఖపట్నం (వారధి న్యూస్) ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ఉద్రిక్తత పెరగడంతో స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు కలెక్టర్ వినయ్ చెందిన కలిసి జిల్లాలో కరోనా వ్యాప్తి పై తగు చర్యలు తీసుకోవాలని వినతిపత్రాన్ని అందజేశారు బుధవారం ఉదయం వి ఎం ఆర్ డి ఏ కి వచ్చిన కలెక్టర్ వినయ్ చంద్ ను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయంతో ప్రజలు ఉన్నారని ఆయన అన్నారు
ఈ సందర్భంగా విశాఖ నగరంలో సినిమా హాల్లో షాపింగ్ మాల్స్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కలెక్టర్లకు వినయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు స్పందించిన కలెక్టర్అధికారులకు పలు సూచనలు సలహాలుఇవ్వడం జరిగింది అన్నారు ఐతే కరోనా వైరస్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు వెలగపూడి రామకృష్ణ బాబుకి తెలిపారు మీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటామని కలెక్టర్ వినయ్ చంద్ హామీ ఇచ్చారు,