వైరస్ మరణించడానికి జనతా కర్ఫ్యూ. ప్రధాని మోడీ ప్రజలకు పిలుపు

న్యూ ఢిల్లీ మార్చి 20 (వారధి న్యూస్) కరోనా వైరస్ పబ్లిక్ ప్లేసుల వద్ద 12 గంటలు జీవించి వుంటుంది. ఈ 12 గంటలు గనక ఈ పబ్లిక్ ప్లేసుల వద్దకు ఎవరూ వెళ్ళకుండా ఉండగలిగితే, ఈ వైరస్ 12 గంటల తర్వాత వెంటనే మరణిస్తుంది. కానీ ప్రస్తుతం ఏం జరుగుతోందంటే 1 లేదా 2 గంటల్లోనే అందరూ ఈ వైరస్ వున్న స్థలాల్లో వుండడం తాకడం చేయడం వల్ల ఈ వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందుతుంది. 12 గంటల పాటు దేశమంతా ఇంటిలోపలే వుండగలిగి ఈ పబ్లిక్ ప్లేసులల్లోని వైరస్ మరణించి దీని వ్యాప్తి చెందే చైన్ ప్రక్రియని మనం మన దేశంలో నియంత్రించగలిగితే మన దేశంలో ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలం


కరోనా వైరస్ పబ్లిక్ ప్లేసుల వద్ద 12 గంటలు జీవించి వుంటుంది. ఈ 12 గంటలు గనక ఈ పబ్లిక్ ప్లేసుల వద్దకు ఎవరూ వెళ్ళకుండా ఉండగలిగితే, ఈ వైరస్ 12 గంటల తర్వాత వెంటనే మరణిస్తుంది. కానీ ప్రస్తుతం ఏం జరుగుతోందంటే 1 లేదా 2 గంటల్లోనే అందరూ ఈ వైరస్ వున్న స్థలాల్లో వుండడం తాకడం చేయడం వల్ల ఈ వైరస్ గణనీయంగా వ్యాప్తి చెందుతుంది. 12 గంటల పాటు దేశమంతా ఇంటిలోపలే వుండగలిగి ఈ పబ్లిక్ ప్లేసులల్లోని వైరస్ మరణించి దీని వ్యాప్తి చెందే చైన్ ప్రక్రియని మనం మన దేశంలో నియంత్రించగలిగితే మన దేశంలో ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేయగలం. అందుకే ఈ 14 గంటల జనతా కర్ఫ్యూ .కాబట్టి దేశ ప్రజలందరూ ఈ ఆదివారం అనగా మార్చి 22 న, ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఇళ్ళకే పరిమితమవ్వాలి. ఏమైనా తప్పని పరిస్థితుల్లో ఇళ్ళు వదిలి బయటకు వెళ్ళాల్సి వస్తే ఉదయం 7 గంటల లోపు మరియు రాత్రి 9 గంటల తర్వాత వెళ్ళవచ్చు.కొన్ని దేశాల్లో అన్ని పబ్లిక్ ప్లేసుల్లో సానిటైసర్స్ ని వెదజల్లడం అన్ని ప్రదేశాలను వీటితో తుడువడం మనం చూస్తూనే వున్నాం. అది ఎంతవరకు ప్రాక్టికల్ అనేది సంశయమే! కానీ మనం ఇలా 12 గంటలు పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళకుండా దానంతట అదే మరణించేట్టు చేయగలిగితే 100% నిర్మూలించగలం... అందుకే 14 గంటల జనతా కర్ఫ్యూ ప్లాన్ చేయబడింది. ఏ మందులూ పబ్లిక్ ప్లేసుల్లో పిచికారి చేయక్కర్లేదు, తుడవక్కర్లేదు... 14 గంటలు వదిలేస్తే దానంతట అదే మరణిస్తుంది.అందరూ సహకరిస్తే మనకు ఈ వైరస్ రాకుండా మనం మన పిల్లలని మన వృద్ధులని మన కుటుంబాలని మన సమాజాన్ని మన దేశాన్ని కాపాడుకోగలం.మర్చిపోకండి, ఎలాంటి కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవద్దు. జనతా కర్ఫ్యూ ఈ ఆదివారం (22 March) ఉదయం 7 గంటలనుండి రాత్రి 9 గంటల వరకు, అంటే 14 గంటలు. సహకరిద్దాం, ఇది మన భవిష్యత్తు కోసమే...