విశాఖపట్నం, మార్చి 20 వారధి న్యూస్ : ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న 'కరోనా వైరస్' వ్యాధి పై ఖాతాదారులకు, ప్రజలకు | అవగాహన కల్పించేందుకు ది కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంకు విసృత చర్యలు చేపట్టింది. ఈ మేరకు అక్కయ్యపాలెంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయం వద్ద 'కరోనా వైరస్' వ్యాధి లక్షణాలు, అది సోకకుండా తీసుకోవాల్సిన జాగత్రలు తదితర అంశాలను తెలియజేస్తూ హెర్డింగ్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు చేతులు కడుక్కోవడంపై అవగాహన కలిగించే విధంగా 'హ్యాండ్ వాష్', 'శానిటైజర్ వంటివి అన్ని బ్యాంకు శాఖలయందు ఏర్పాటు చేశారు.
సిబ్బంది ఆరోగ్య రక్షణ నిమిత్తం 'మాస్క్'లను అందజేయడమే కాకుండా వారికి 'కర్ఫ్యూ' సమయంలో నిత్యవసర వస్తువులు అత్యవసరంగా కొనుగోలు చేసుకునేందుకు వీలుగా రూ.6వేలు ఆర్థిక సహాయాన్ని వేతన అడ్వాన్స్ గా కూడా చేస్తున్నట్టు బ్యాంకు వ్యవస్థాపక అధ్యక్షులు పరుచూరు రఘునాధరావు ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న 'కరోనా' వ్యాధి పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఛైర్మన్ సూచించారు. దేశ ప్రధాని ప్రకటించిన ఈ నెల 22వ తేదీ 'జనతా కర్పూ' లో భాగంగా బ్యాంకు ఆదివారం పనిచేస్తున్న శాఖలు పనిచేయవని ఈ సందర్భంగా ఛైర్మన్ ప్రకటించారు. ఇటువంటి కార్యక్రమాలు , కనకమహాలక్ష్మి కోఆపటివ్ బ్యాంకు చేపట్టడం తమ బాధ్యతని, వదంతులను నమ్మవద్దని, పరిసరాలు, వ్యక్తిగత శుభ్రత అవసరమని ఛైర్మన్ పి.రఘునాధరావు పేర్కొన్నారు. 'కరోనా' వ్యాధి పై అవగాహన కలిగించేందుకు బ్యాంకు తీసుకుంటున్న చర్యలకు ఖాతాదారులు, వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు.