కరోనా పై కంగారు వొద్దు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

విశాఖపట్నం,మార్చి, 19:వారధి న్యూస్ కరోనా వైరస్ పై ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అలాగని నిర్లక్ష్యం కూడా వద్దని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరం పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని చెప్పారు. విశాఖపట్నంలో కరోనా కేసు ఒక్కటీ నమోదు కాలేదన, ఎవరూ ఏ విధమైన భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విమానాశ్రయంలో తనిఖీ బృందాలు ఉన్నాయని, విదేశాలు మరియు స్వదేశీయలను తనిఖీ చేసారని తెలిపారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలలో కరోనా గూర్చి ఎనౌన్స్ చేస్తారని చెప్పారు. పర్యాటక ప్రాంతాలులో స్క్రీనింగ్ మిషన్ పెట్టాలని అధికారులకు సూచించినట్లు తెలిపారు


పాడేరు, అనకాపల్లి ప్రాంతాల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తారని, ఎజడ్ అచ్యుతాపురం, గాజువాకలలో స్క్రీనింగ్ మిషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. వేరే దేశాల నుండి వచ్చే వారిని విమానాశ్రయంలో తప్పనిసరిగా తనిఖీ చేస్తారని పేర్కొన్నారు. విశాఖ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(విమ్స్)లో క్వారంటైన్డ్ వార్డులు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రులైన విమ్స్, ఛాతి, మెంటల్, ఇఎన్ది. హాస్పిటల్స్ లో క్వారంటైన్ వార్డులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా గీతం, గాయిత్రి మెడికల్ కళాశాలల్లో క్వారంటైన్డ్ వార్డులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. మరిన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ను వినియోగించనున్నట్లు ఆయన వివరించారు. ఆర్.టి.పి.సి. మిషన్ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లలో స్క్రీనింగ్ మిషన్లు ఉండాలని చెప్పారు. గ్రూపు మీటింగులు పెట్టకూడదని, పెళ్లిళ్లు, పండగలను ఇళ్ల' వద్దనే చేసుకోవాలని ఆయన కోరారు.