కరోనా పై అవగాహన పెంచాలి వీడియో కాన్ఫరెన్స్ లో   సీఎం వైఎస్ జగన్ 

విశాఖపట్నం మార్చి 20:వారధి న్యూస్  కరోనా పై ప్రజల్లో అపోహలను పోగొట్టాలని, అవగాహన పెంచాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కరోనా నిరోధక చర్యలు, ఇళ్ల పట్టాల పంపిణీపై శుక్రవారం ఆయన రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో   వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాపై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఆందోళనకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కరోనా సాకుగా ధరలు పెంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి  హెచ్చరించారు.  గ్రామ సచివాలయాల ద్వారా నిత్యావసర వస్తువులపై దృష్టి సారించాలని సూచించారు.ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ఏఎన్‌ఎం, ఇద్దరు ఆశావర్కర్లు ఉన్నారు.


వీరే కాకుండా ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ ఉన్నారు. ఒక యాప్‌ను వాళ్ల ఫోన్లలో అందుబాటులోకి ఇచ్చాం. ఈ యాభై ఇళ్లకు సంబంధించి డేటాను కలెక్ట్‌ చేసి ఉంచుతున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో విశాఖపట్నం నుండి జిల్లా ఎస్ పి అట్టాడ బాపూజీ, జీవీఎంసీ ఇన్చార్జి కమిషనర్ ఈశ్వరరావు, జాయింట్ కలెక్టర్లు ఎల్ శివ శంకర్ ఎం వేణుగోపాలరెడ్డి, జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ మన మనజీర్ జిలాని సామూన్ పాల్గొన్నారు.