అమరావతి మార్చి 19 :వారధి న్యూస్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ కంటే తానే ఎక్కువ అని సీఎం జగన్ భావిస్తున్నాడని టీడీపీ నేత నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ తన లేఖ ఫేక్ అని ఫిర్యాదు చేయకుండానే వైసీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకున్నారని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్ లేఖ అవాస్తవమైతే కేంద్ర బలగాలు ఎలా వచ్చాయని నిలదీశారు. భద్రతాపరమైన అంశాలకి సంబంధించి రహస్య లేఖ రాస్తారని, అధికారులు బహిరంగంగా స్పందించాల్సిన అవసరం లేదన్నారు. మంత్రి పెద్దారెడ్డిని గవర్నర్ బర్తరఫ్ చేయాలని నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు