కరోనా హెల్ప్ డెస్క్ లు జివిఎంసి కమిషనర్ పి.కోటేశ్వరరావు

విశాఖపట్నం, మార్చి 19(వారధి న్యూస్) :- ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కోవిడ్- 19 (కరోనా) వైరస్ నియంత్రణకు జివిఎంసి చేపట్టిన చర్యలు విశాఖపట్నం, మార్చి 19 :- ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కోవిడ్- 19 (కరోనా) వైరస్ జివిఎంసి పరిధిలో విస్తరించకుండా ప్రజారోగ్య విభాగం ఆధ్వర్యంలో కార్పోరేషన్ పలు చర్యలు చేపట్టిందని.పత్రికా ప్రకటనలో తెలిపారు. వైరస్ వ్యాప్తి లేకుండా కట్టు దిట్టమైన చర్యలు చేపడతున్నామని జివిఎంసి పరిధిలోగల ప్రధాన కూడళ్ళు ఆర్టిసి కాంప్లెక్స్, ద్వారకానగర్, రైల్వే స్టేషన్, బీచ్ రోడ్డు, విమానాశ్రయం, ఎన్ఏడి జంక్షన్, మద్దిలపాలెం బస్ స్టేషన్ మొదలగు ప్రాంతాలలో “హెల్ప్ డెస్క్” లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బయోమెట్రిక్ హాజరు విధానాన్ని, అన్ని జోన్లలోగల సిబ్బందికి మరియు ప్రధాన కార్యాలయంలో గల సిబ్బంది మరియు అధికారులకు రద్దు చేసామని చెప్పారు. ప్రభుత్వం నుండి వచ్చిన విమానయాన ప్రయాణికులు జాబితా ప్రకారంగా జివిఎంసి పరిధిలో 463 మందిని పరిశీలనలో ఉంచామని, ఎటువంటి పాజిటివ్ కేసులు లేవని, ఎవరైనా అనుమానిత ప్రయాణికుల కంప్లైంట్ చేస్తే వారిని ఛాతి హాస్పిటలక్ కు పంపుటకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనుమానితుల గృహములవద్ద సూక్ష్మ పరిధిలో పారిశుధ్య పనిని విస్తరిస్తున్నామన్నారు. జివిఎంసి పరిధిలో బీచ్ రోడ్డులో నడుపుచున్న స్విమ్మింగుపూలును మూసివేసామని, వి.ఎమ్.ఆర్.డి.ఏ సెంట్రల్ పార్కు వద్ద గల రాత్రి పుడ్ కోర్టును నడుపకుండా చర్యలు చేపట్టాయన్నారు