శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మూసివేత
 


చిత్తూరు:మార్చి 20  కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్నింటినీ మూసి వేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమును నేటి నుంచి మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. అయితే స్వామి, అమ్మవార్లకు జరుపు సేవలను మాత్రం ఎలాంటి మార్పూ లేకుండా దేవస్థానం వారే నిర్వహించనున్నామని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.