విశాఖపట్నం మార్చి 19( వారధి న్యూస్ )ఆంధ్రవిశ్వవిద్యాలయం రెక్టార్ గా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు సి. హెచ్ రత్నం నియమితులయ్యారు. వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ నుంచి ఆయన బుధవారం స్వీకరించారు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం రెక్టార్ గా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆచార్యులు సి. హెచ్ రత్నం నియమితులయ్యారు. వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి సమక్షంలో నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ నుంచి ఆయన బుధవారం స్వీకరించారు. అనంతరం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఆచార్య రత్నం మహిళా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ గా సేవలు అందించారు. ప్రస్తుతం ఇంజనీరింగ్ కళాశాల వైఎస్ ప్రిన్సిపాల్ గా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆచార్య రత్నంను అకడమిక్ డీన్ ఆచార్య కె.వెంకట రావు, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పేరి శ్రీనివాస రావు, డీన్లు ఆచార్య డి.వి.ఆర్ మూర్తి, భుజంగ రావు, డాక్టర్ చల్లా రామక్రిష్ణ తదితరులు అభినందించారు.