ద్వారకా తిరుమల ఆలయం మూసివేత

ఏలూరు:మార్చి 20 వారధి న్యూస్; కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా నేటి మధ్యాహ్నం నుంచి ద్వారకా తిరుమల చిన్న వెంకన్న దేవాలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భక్తుల దర్శనంతో పాటు కేశఖండనశాల, అన్న ప్రసాదం వితరణ కూడా అధికారులు నిలిపివేయనున్నారు. ఇప్పటికే ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలనూ రద్దు చేశారు. ఆన్‌లైన్ టికెట్లను సైతం ఆలయ అధికారులు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు