మీరు ఇంట్లోనే.. మీ కోసం మేం బయట
విజయవాడ:మార్చి 21 వారధి న్యూస్ ‘‘ప్రధాని, ముఖ్యమంత్రి పిలుపునకు స్పందిద్దాం.. కరోనా వైరస్(కోవిడ్-19)ను జయిద్దాం’’ అని డీజీపీ గౌతం సవాంగ్ పిలుపునిచ్చారు. ఆదివారం ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ప్యూ పాటించాలన్నారు. ‘ఇంట్లోనే ఉండి మద్దతు తెలపండి.. మీ రక్షణ కోసం బయట మేముంటాం’ అని పేర్కొన్నారు
. ‘ఇంట్లోనే ఉండి మద్దతు తెలపండి.. మీ రక్షణ కోసం బయట మేముంటాం’ అని పేర్కొన్నారు. అదే విధంగా జనతా కర్ఫ్యూ సందర్భంగా.. ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి పోలీస్ సిబ్బంది అందరూ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండవలసిందిగా అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవుతారు కావున పోలీసులు అప్రమత్తతో ఉంటారని... కంట్రోల్ రూమ్‌ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు. ఇక ఇది ప్రజలు తమకు తాముగా పాటించే కర్ఫ్యూ మాత్రమేనని.. డయల్ 100 ద్వారా విస్త్రృతంగా.. నిరంతరంగా సేవలు పొందాలని ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూ ని ప్రజలందరూ పాటించి మన సంకల్పాన్ని చాటి చెబుదాం