విశాఖపట్నం మార్చి 18 వారధి న్యూస్ ;ఆంధ్రవిశ్వవిద్యాలయం పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థి దానబత్తుల గిరిబాబుకు వర్సిటీ డాక్టరేట్ లభించింది. విభాగ ఆచార్యులు పి.వి.వి ప్రసాద రావు, ఇస్రో, ఎస్ఆర్ఎస్ సి శాస్త్రవేత్త డాక్టర్ సి.సుధాకర్ రెడ్డిల సంయుక్త పర్యవేక్షణలో 'ఎసెస్ మెంట్ ఆఫ్ నేఫనల్ ప్రాజెక్ట్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్ మెంట్ గోల్స్ యూజింగ్ జియో స్పేషియల్ టెక్నాలజీస్' అంశంపై జరపిన పరిశోధనకు డాక్టరేట్ లభించింది. మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్ పథకాలు ఐక్యరాజ్యసమితి నిర్ధారించిన అభివృద్ధి లక్ష్యాల సాధనకు దోహదం చేస్తున్న విధానాపై నేషనల్ రిమోట్ సెంటర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్న గిరిబాబు పరిశోధన జరిపారు. ఉపగ్రత చిత్రాలు, ఆధునిక సాంకేతికత సహకారంతో విశ్లేషించారు. స్వచ్ఛభారత్ పథకంతో అతిసారం నియంత్రణ, స్త్రీలపై అత్యాచారాల నియంత్రణకు ఉపయుక్తంగా నిలుస్తున్నట్లు గిరిబాబు తన పరిశోధనలో వివరించారు.