విశాఖపట్నం,మార్చి,18 :వారధి న్యూస్ భూ ఆక్రమణలపై ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు బృందం మధ్యంతర రిపోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినట్లు దర్యాప్తు బృందం అధ్యక్షులు డా. విజయ్ కుమార్ వెల్లడించారు. బుధవారం సర్క్యూట్ హౌస్ లో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఎన్.ఓ.సి. కేసులు ఉన్నాయని, ప్రభుత్వ భూ కేటాయింపు కేసులు 20 ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తహసిల్థార్లతో ఒక సమావేశం ఇప్పటికే ఏర్పాటు చేయడమైనదని ఒక వారం లేదా పది రోజులో రిపోర్టులు ఇస్తామని చెప్పినట్లు ఆయన తెలిపారు. సర్వేయర్లను వినియోగించుకొని త్వరితగతిన సబ్ డివిజన్ చేయాలని తహసిల్థార్లను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. 1380 దరఖాస్తులను స్వీకరించగా ఇందులో 679 దరఖాస్తులు సంబంధిత తహసిల్థార్లకు పంపడమైనదని ఆయన వివరించారు. ఇప్పటి వరకు 420 రిపోర్టులు తహసిల్థార్ల నుండి వచ్చినట్లు ఆయన తెలిపారు. 1380 దరఖాస్తులలో 342 దరఖాస్తులను డిప్పోజ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో సభ్యులు వై.వి. అనూరాధ, టి. భాస్కరరావు, కె. దుర్గానంద్ ప్రసాద్ రావు, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
---------------------------------------------------------