విశాఖపట్నం వారధి న్యూస్;17/03 ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై ఏపీ వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. దౌర్జన్యాలు చేయాల్సిన కర్మ తమకు పట్టలేదని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజలు తమపై విశ్వాసంతోనే అవకాశం కల్పించారని, కరోనా వైరస్‌కు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి అవంతి తెలిపారు. చంద్రబాబుని చెప్పమనండి ఇప్పుడే ఏ మందులు ఇస్తారు? అని మంత్రి ప్రశ్నించారు. ఏ హాస్పిటల్‌కి వెళ్లినా పారాసిట్‌మాల్ ఇస్తారని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
చంద్రబాబుని చెప్పమనండి ఇప్పుడే ఏ మందులు ఇస్తారు మంత్రి అవంతి