కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రతరం:మాజీ సీఎం బాబు

అమరావతి :మార్చి 20 వారధి న్యూస్ కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్రతరమవుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 177దేశాలకు కరోనా విస్తరించిందని, 10వేల మందిపైగా మృతి తెలిపారు. టీడీపీ నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘కరోనా తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయాలి. ముందస్తు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన పెంచాలి.


ఆదివారం జనతా కర్ఫ్యూ అందరూ పాటించాలి. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అక్రమాలపై పోరాడాలి. ప్రతిచోటా డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లు సేకరించాలి. వైసీపీ బెదిరింపులపై సాక్షాలు సేకరించాలి. అన్ని సాక్ష్యాధారాలను ఆర్వోలకు, ఈసీకి పంపించాలి. వేలాదిమందిపై తప్పుడు కేసులు బనాయించారు. ఎస్‌ఈసీ రాసిన లేఖలో ఈ అక్రమాలన్నీ పేర్కొన్నారు. వైసీపీ దాడులు, దౌర్జన్యాలపై కేంద్రానికి పంపారు. అందుకే ఈసీపై కత్తికట్టారు, కుటుంబాన్ని బెదిరించారు. ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై కోర్టులలో కేసులు వేయాలి. చట్టాలు, నిబంధనలపై అభ్యర్ధులు అవగాహన పెంచుకోవాలి’’ అని చంద్రబాబు సూచించారు.