జనతా కర్ఫ్యూని జయప్రదం చేయండి - జివిఎంసి కమిషనర్

జివిఎంసి పరిధిలో జనతా కర్ఫ్యూని జయప్రదం చేయండి - జివిఎంసి కమిషనర్ పి.కోటేశ్వరరావు


విశాఖపట్నం, మార్చి 21వారధి న్యూస్ :- కరోనా వైరస్ మహమ్మారి నుండి బయటపడటానికి  జివిఎంసి పరిధిలో గల ప్రజలు స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పాల్గొనాలని, జివిఎంసి కమిషనర్ పి.కోటేశ్వరరావు కోరారు  ప్రయాణాలు రద్దు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారుసామూహిక సమావేశాల్లో పాల్గొనకూడదని మనవి చేశారు , ప్రజలు భాగస్వామ్యం ఉంటే ఇువంటి వ్యాధుల నుండి రక్షించుకోవడం సులభతరం అవుతుందని కమిషనర్ పి.కోటేశ్వరరావు తెలిపారు. జివిఎంసి పరిధిలోగల వివిధ రంగాల వ్యాపారస్తులు, ధియేటర్ మరియు హోటల్ యాజమాన్యం వారు రెసిడెన్షియల్ సంక్షేమ సంఘాలు, రైతుబజారులో గల విక్రయదారులు, వీధి విక్రయదారులు ఇతర సంఘాలు వారు ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ప్యూలో ఆదివారం  స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం కమిషనర్ పి.కోటేశ్వరరావు కోరారు అదే రోజు సాయంత్రం 5 గంటల సమయంలో కరోనా వైరస్ సోకిన వ్యాధిగ్రస్తులకు నిరంతరం సేవనందిస్తున్న వైద్యులకు , శాస్త్రవేత్తలకు, వైద్యసిబ్బంది ఇతర పారిశుద్ధ్య కార్మికులకు 5 నిమిషముల పాటు చప్పట్లు ద్వారా కృతజ్ఞతలు తెలియజేయవలసినదిగా కమిషనర్ వారు పత్రికా ప్రకటనలో కోరారు.