విశాఖపట్నం మార్చి 19( వారధి న్యూస్): కరోనా వైరస్ కోవిడ్- 19 తీవ్రత పై తగు అప్రమత్తంగా ప్రజలు ఉండాలని, జివిఎంసి చేస్తున్న పలుసూచనలు ప్రజలు పాటించాలని జివిఎంసి కమిషనర్ కోరారు. కరోనా వైరస్ నియంత్రణ పై సిడిఎంఏ విజయకుమార్ఎ స్ఆర్ఆర్ జి, నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కమిషనర్ బదులిస్తూ ఈ వ్యాధి నియంత్రణ పై జివిఎంసి పరిధిలో అనేక అవగాహన చర్యలు ప్రజలు, జిల్లా
వైద్యశాఖాధికారులు, పోలీసు అధికారులు మరియు జిల్లా కలెక్టరు వారి సహకారంతో చేపట్టామని తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ జారీచేసిన సూచనలుకు అనుగుణంగా, జివిఎంసి పరిధిలో మరిన్ని చర్యలు చేపడతామన్నారు
జివిఎంసి వార్డు వాలంటీర్లు, వార్డు కార్యదర్శులతో, మహిళా సంఘ సభ్యులతో ఈ వైరస్ నియంత్రణ పై అవగాహన కార్యక్రమాలు ఉధృతం చేస్తామన్నారు. ఐఇసి పద్ధతిలో హోర్డింగులు, ఫ్లెక్సీలు, కరపత్రాలు మొదలగువాటి ద్వారా, గృహములు వద్ద, నగర ముఖ్య కూడళ్లులో, మార్కెట్లు మొదలగు వాటి వద్ద ప్రచారం చేయడమైనదని తెలిపారు. నగరంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపడడానికి తగు ప్రణాళికా బద్ధంగా పనిచేయాలని, పారిశుధ్య విభాగపు అధికారులకు , సిబ్బందికి తగు ఆదేశాలు జారీచేసామన్నారు. నగరంలో జోన్-2 పరిధిలోగల ఒక షాపింగ్ మాల్ లో, చీరలు రిబేటు పై అమ్మకం చేయగా ఎక్కువ మంది మహిళలు గుమిగూడి కొనుగోలు చేసే ప్రయత్నాన్ని జివిఎంసి అధికారులు పోలీసువారి సహకారంతో ఆపించారని, మహిళలకు ఈ వ్యాధిపై అవగాహన చేయడం వలన వారు స్వచ్చందంగా ఆ ప్రాంతం వీడి వెళ్ళిపోయారని ఇంకోసారి ఇలాంటివి పునరావృతం అవకుండా షాపింగ్ మాల్ నిర్వాహకులుకు తీవ్ర హెచ్చరికలు చేసామని చెప్పారు.