స్వచ్ఛంద భాగస్వామ్యం అవ్వాలి; ఎన్నికల కమిషనర్

స్వచ్ఛంద భాగస్వామ్యం అవ్వాలి; ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్



విజయవాడ మార్చి 21 వారధి న్యూస్; దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో , జాతిని ఉద్దేశించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు కు అనుగుణంగానే స్వీయ నియంత్రణ లో భాగంగా సామాజిక దూరం పాటిస్తున్నట్లు శనివారం సాయంత్రం విడుదల చేసిన ఒక ప్రకటన లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్. రమేశ్ కుమార్ తెలిపారు.కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రణకై ప్రతి ఒక్కరూ తమ వంతుగా స్వీయ నియంత్రణతో స్వచ్ఛంద భాగస్వామ్యం అవ్వాల్సి ఉందని పేర్కొన్నారు.