కరోనా దెబ్బకు పూజా హగ్దే ఇంటికి పరిమితం

 


మార్చి 20 కరోనా దెబ్బకు అంత ఇంటికి పరిమితం అవుతున్నారు. ఇంట్లో నుండి బయటకు వచ్చేందుకు వణికిపోతున్నారు. ముఖ్యంగా సినీ ప్రముఖులు..ఎప్పుడు బయటి దేశాలకు ప్రాముఖ్యత ఇచ్చే వీరు..ఇప్పుడు బయటి దేశం అంటే వామ్మో అంటున్నారు. తాజాగా వరుస సక్సెస్ లతో ఫుల్ స్వింగ్ లో ఉన్న పూజా హగ్దే హౌస్ అరెస్ట్ అయ్యింది.


తాజాగా ప్రభాస్ మూవీ షూటింగ్ కోసం జార్జియా వెళ్లిన పూజ.. ఇంటికి వచ్చిన వెంటనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది. 14 రోజుల పాటు బయటకు వెళ్లోద్దని అధికారులు సూచిందడం తో ఇంట్లో ఉంది కాలు బయటకు పెట్టడం లేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ వణికిస్తుంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం లో 15 కేసులు , ఆంధ్రప్రదేశ్ లో మూడు కేసులు బయటపడ్డాయి