ఆంధ్రవిశ్వవిద్యాలయానికి మార్చి 30వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు వాట్సాప్ వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ పత్రికా ముఖంగా ఒక ప్రకటనలో తెలియజేశారు. ఏయూ వైస్ చాన్సలర్ పంపినట్లు పేర్కొంటూ ఇంపార్టెంట్ సర్క్యులర్ పేరుతో ఒక సంక్షిప్త సందేశం వాట్సాప్ లో హల్ చేయడం ఆయన దృష్టికి వచ్చింది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలోని బిటెక్, ఎంటెక్ విద్యార్థులకు, ఇతర కళాశాలల విద్యార్థులకు ఈ నెల 30 వ తేదీ వరకు సెలవులను ప్రకటిస్తున్నట్లు ఈ మెసేజ్ లో పేర్కొన్నారు. దీనిపై రిజిస్ట్రార్ ఆచార్య వి.క్రిష్ణమోహన్ మాట్లాడుతూ ఇటువంటి అసత్య ప్రచారాలను ఎవ్వరూ నమ్మవద్దన్నారు. వాట్సాప్ లో దర్శనమిస్తున్న సంక్షిప్త సందేశం ఏయూ వీసీ కార్యాలయం నుంచి పంపలేదని ఆయన వివరించారు. ప్రస్తుతానికి వర్సిటీ కళాశాలలకు ఎటువంటి సెలవులు ప్రకటించలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి అసత్య ప్రచారాలు ఎవ్వరూ చేయరాదని ఆయన సూచించారు. అసత్య ప్రచారానికి పాల్పడిన వారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. వర్సిటీ సెలవులపై వదంతులు ప్రచారం నమ్మోద్దు వర్సిటీ సెలవులపై వదంతులు ప్రచారం నమ్మోద్దు రిజిస్ట్రార్