మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి జె సి ఎల్ శివ శంకర్

 


విశాఖపట్నం, మార్చి 19( వారధి న్యూస్) : మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని సంయుక్త కలెక్టర్ ఎల్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో నిర్వహించిన జిల్లాస్థాయి కొనుగోలు కమిటీ (DLPC) సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హామీ మేరకు క్వింటాలుకు రూ.1760 చొప్పున మద్దతు ధర ఉంటుందని తెలిపారు . కోళ్ల పరిశ్రమ నిర్వీర్యం అవడం మూలంగా కోళ్లకు మేతగా ఉపయోగించే మొక్కజొన్న కొనుగోళ్లు తగ్గాయన్నారు.


విశాఖపట్నం, మార్చి 19: మొక్కజొన్న రైతులను ఆదుకునేందుకు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని సంయుక్త కలెక్టర్ ఎల్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్లో నిర్వహించిన జిల్లాస్థాయి కొనుగోలు కమిటీ (DLPC) సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ హామీ మేరకు క్వింటాలుకు రూ.1760 చొప్పున మద్దతు ధర ఉంటుందని తెలిపారు . కోళ్ల పరిశ్రమ నిర్వీర్యం అవడం మూలంగా కోళ్లకు మేతగా ఉపయోగించే మొక్కజొన్న కొనుగోళ్లు తగ్గాయన్నారు. అందువల్ల మొక్కజొన్న ధర క్వింటాలుకు రూ.1200 కు తగ్గిపోయింది అన్నారు. మన జిల్లాలో భీమిలి పద్మనాభం మండలాల్లో ప్రధానంగా జొన్న పంటను రైతులు అధికంగా సాగు చేస్తున్నారని, ప్రస్తుతం పంట కోత దశలో ఉన్నదని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లను ఏపీ మార్క్ ఫెడ్ వారు ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలన్నారు.దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు లీలావతి, డి ఆర్ డి ఎ పథక సంచాలకులు వి.విశ్వేశ్వరరావు , జిల్లా సహకార అధికారి మిల్టన్, మార్క్ ఫెడ్ మేనేజరు అరుణ, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు కాళేశ్వరరావు పద్మనాభం వ్యవసాయ అధికారి ఏ. కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి