అమరావతి :మార్చి 18 (వారధి న్యూస్) ; ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌కు భద్రత పెంచారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అనంతరం వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో రమేశ్ కుమార్‌కు 1+1 నుంచి 4+4కి ప్రభుత్వం నిఘా పెంచింది.
ఉదయం నుంచి 4+4 సెక్యూరిటీ విధుల్లో చేరింది. మరోవైపు ఎస్ఈసీ రమేశ్ కుమార్ లేఖ వ్యవహారంపై సీఎం జగన్, డీజీపీ సవాంగ్, ఐబీ చీఫ్ మనీష్ కుమార్ భేటీ అయ్యారు. ఈ లేఖ ఎవరి ద్వారా వెళ్లింది.. వాస్తవమేనా. లేదా అన్నదానిపై చర్చించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్న లేఖపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాల్సిందిగా అధికారులను సీఎం జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది.