కరోనా క్లీనింగ్ రైల్వే  డిఆర్ఎం కార్యాలయంలో

 


విశాఖపట్నం మార్చి 18, వారధి న్యూస్ , 
ఎవరి నోట  వెన్న ఎక్కడ చూసినా కరోనా గురించే మాటలు దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలతో సత్సంబంధాలు కలిగి రోడ్డు రవాణా సంస్థ  కాంప్లెక్స్ రైల్వే స్టేషన్ లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటున్నారు
అందులో భాగంగానే బుధవారం విశాఖపట్నం  రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు కోవిడ్ 19 ప్రభావంతో  డి ఆర్ ఎం కార్యాలయంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తినీ పూర్తిగా తనిఖీ చేస్తున్నారు. కార్యాలయం బయట వాష్ బేసిన్, మంచి నీటి కుళాయి, డెట్టాల్, హ్యాండ్ వాష్ లిక్విడ్ లను ఏర్పాట్లు చేసారు. ప్రతి ఒక్కరూ తమ చేతులను తప్పని సరిగా కడుక్కున్నా తర్వాతే కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. డి ఆర్ ఎం కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద భద్రతా బలగాలు ధర్మో సెన్సార్ ల తో ప్రతి ఒక్కరిని తనిఖీ చేస్తున్నారు. శరీర ఉష్ణోగ్రత 98 డిగ్రీలు దాటితే వారిని లోనికి అనుమతించడం లేదు. ఉన్నతాధికారులను సైతం పరిశీలించిన తర్వాతే కార్యాలయంలోకి అనుమతించడం పై దిగువస్థాయి, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు