108 ఆంబులెన్స్ లో డెలివరీ.తల్లి పిల్ల క్షేమం
********
అవనిగడ్డ వారధి న్యూస్ ఏప్రిల్ 12 : నాగాయలంక మండలం పెద్ద కమ్మవారిపాలెంకు చెందిన 24 సంవత్సరాల ఆరేవరపు నాగలక్ష్మి ( భర్త )(చినకొండయ్య) 108 వాహనంలో డెలివరీ అయ్యారు. ఆడివార0 ఉదయం పురిటి నొప్పులతో అంబులెన్స్ కు ఫోన్ చేయగా, అవనిగడ్డ అంబులెన్స్ కేస్ తీసుకుని ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన పది నిమిషాలకే మార్గం మధ్యలో డెలివరీ అయింది. మగపిల్లాడు పుట్టాడు. తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారు. అనంతరం నాగాయలంక గవర్న్మెంట్ హాస్పటల్లో అడ్మిట్ చేశాం. ఇఎంటీ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సి.హెచ్ వేంకట నర్సయ్య . పైలెట్ డ్రైవర్ ఆర్. సుశీల్ కుమార్ సేవలు అందించారు