ముఖ్యమంత్రులు ఎప్పుడైనా నాతొ మాట్లాడవచ్చు; ప్రధానమంత్రి మోదీ
24 గంటలూ ముఖ్యమంత్రులకు అందుబాటులో ఉంటా
న్యూఢిల్లీ : ఎప్పుడైనా నాతొ మాట్లాడవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఉంటానని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. . భుజం భుజం కలిపి... కరోనాపై విజయం సాధిద్దాం’’ అని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పొడగింపు విషయంపై శనివారం ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి నరేంద్ర మోదీ బట్టతో కుట్టిన ‘హోంమేడ్ మాస్కు’ ధరించి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రెసెంటేషన్‌ను అందించింది. ఈ ప్రజంటేషన్ ముగిసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు ముఖ్యమంత్రులు మోదీతో మాట్లాడటం ప్రారంభించారు. లాక్‌డౌన్ పొడగింపుకే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు దాదాపుగా మొగ్గు చూపినట్లు సమాచారం. ఒరిస్సా, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడగించాయి అని తెలిపారు .