మాల్స్ లో జీ సీసీ ఉత్పత్తుల అమ్మకాల ద్వారా గిరిజన రైతులకు ఆర్థిక ప్రోత్సహం .... జాయింట్ కలెక్టర్ శివ శంకర్
విశాఖపట్నం ఏప్రిల్ 30 షాపింగ్ మాల్స్ లో గిరిజన ఉత్పత్తుల అమ్మకాలను చేపట్టి గిరిజన ప్రాంత ప్రజలకు ఆర్థిక చేయూతను ఇవ్వాల్సిందిగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం జెసి ఛాంబర్ లో స్పెన్సర్స్, రిలయన్స్, మోర్, డి మార్ట్ , జొమాటో , స్విగ్గి సంస్థల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పాడేరు అరకు ఏజెన్సీ ప్రాంతంలో పలురకాల గిరిజన ఉత్పత్తులు కొండ చీపుర్లు , చింతపండు, తేనె, అరకు కాఫీ, పసుపు, కారం పొడి, రాజ్మా సబ్బులు, రైతులు పండించే ఆర్గానిక్ ఉత్పత్తులు కూరగాయలు, పండ్లు తదితరాలను కొనుగోలు చేసి షాపింగ్ మాల్స్ లో అమ్మకాలు చేపట్టాలన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా గిరిజన రైతులు వారు పండించిన మరియు తయారుచేసిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించడమే కాకుండా ఆర్థికంగా చేయూతనిచ్చి నట్లు అవుతుందన్నారు.ఈ సమావేశంలో జిసిసి జనరల్ మేనేజర్ అశోక్ కుమార్, మార్కెటింగ్ ఏడి కాళేశ్వరరావు, షాపింగ్ మాల్స్ ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.