మొక్క జొన్న కొనుగోలు కేంద్రం,ప్రారంభించిన మంత్రులు ముత్తంశెట్టి కురసాల
పాల్గొన్న ఎంపీ ఎంవివి ,జాయింట్ కలెక్టర్ శివశంకర్
విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 11 భీమిలీ నియోజక వర్గం లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కురసాల కన్నబాబు, గౌరవ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పలు కార్యక్రమాలలో పాల్గోన్నారు. పద్మనాభం మండలం, మండల ప్రజా పరిషత్ కార్యలయం వద్ద మొక్క జొన్న కొనుగోలు కేంద్రం, భీమిలి మార్కెట్ యార్డ్ వద్ద మొక్క జొన్న కొనుగోలు కేంద్రాన్ని గౌరవ మంత్రులు కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ ఎంవివి సత్యనారాయణ కలసి ప్రారంభించారు. అనంతరం భీమిలి మూడోవ వార్డు, చిన్న బజార్ నందు నిరుపేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ, చేసి.. భీమిలి, జి.వి.ఎం.సి జోనల్ కార్యాలయం వద్ద వార్డు వాలంటరీస్ కు, పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎంవివి సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు.