పేదలకు నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ 

పేదలకు సాయం తృప్తిని ఇస్తుంది; 43 వ వార్డు వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ


పేదలకు నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ 


విశాఖపట్నం, వారధి న్యూస్ ఏప్రిల్ 16 లాక్ డౌన్ నేపథ్యంలో పేదప్రజలకు తమ వంతు సాయం గా 43 వ వార్డు వైసిపి కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ  పేదలకు నిత్యావసర వస్తువులు,కూరగాయలు  పంపిణీ  చేశారు. గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉషశ్రీ  ,స్వాతి ప్రమోటర్స్ ఎండీ మేడపాటి రమేష్ రెడ్డి 
 పాల్గొని కాయగూరలు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ     మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదవారిని ఆదుకోవడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ పంపిణి  కార్యక్రమంలో గోదావరి రెడ్డి కల్చరల్ అసోసియేషన్ సభ్యులు ఓగి రెడ్డి వెంకటరెడ్డి ,పడాల వెంకటేశ్వరరెడ్డి శ్రీనివాసరెడ్డి సత్తి వీర రాఘవ రెడ్డి పి సూర్యనారాయణ రెడ్డి,తాటి ప్రభాకర్ ,తాడి శివారెడ్డి పాల్గొన్నారు.