రామ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో భోజనాలు
పారిశ్రామిక ప్రాంతం లో నిత్యవసరసరుకులు పంపిణి గుడివాడ లతీష్
విశాఖపట్నం (గాజువాక) ఏప్రిల్ 27 వారధి న్యూస్ లాక్ డౌన్ తో రోజు వారి కూలీలు వలసకార్మికులకు ఉపాధి లేక ఇబ్బందిపడుతున్నవారికి రామ్ నగర్ యూత్ ఆధ్వర్యంలో గుడివాడలతీష్ నాయకత్వంలో సోమవారం 600 మంది కి భోజనాలు నిత్యవసరసరుకులుగాజువాక పారిశ్రామిక ప్రాంతమైన 68 వార్డ్ లో పంపిణి చేశారు . ఈ సందర్భంగా 68 వార్డ్ వైయస్సార్ పార్టీ నాయకులు గుడివాడలతీష్ మాట్లాడుతూ రోజు రోజుకి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి కావునప్రజలందరూ ప్రస్తుతపరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు సామాజిక దూరాన్ని , స్వయంనియంత్రణ పాటిస్తూ ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టే దిశగా ప్రజలు పయనించాలని తెలియజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ వంతు సహాయసహకారాలు అందించిన రామ్ నగర్ యూత్ కి అభినందనలు తెలిపిన గుడివాడలతీష్ గారు, ఈ కార్యక్రమంలో హుస్సేన్, హంసవల్లి, ఉమా, సురేష్ , బషీర్ తదితరులు పాల్గొన్నారు