మొబైల్ ఆర్డర్ చేస్తే ఇంటి వద్దకే మెడిసిన్స్ విశాఖ ప్రజలు సద్వినియోగం చేసుకోండి ...... జాయింట్ కలెక్టర్ శివ శంకర్
విశాఖపట్నం ఏప్రిల్ 30 ప్రజలకు అవసరమైన మెడిసిన్ లను మొబైల్ ఆప్ ద్వారా కొనుగోలు కు ఆర్డర్ చేసుకుంటే రెండు గంటల లోపల ఇంటి వద్దకే ఉచిత డెలివరీ సదుపాయాన్ని పొంద వచ్చని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్ తెలిపారు. గురువారం జే సీ ఛాంబర్ లో సిరోనా ఫార్మసీ సంస్థ తయారు చేసిన మొబైల్ ఆప్ ను జే సీ ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలక్టర్ మాట్లాడుతూ దేశంలో మొదటి సారిగా లోకల్ ఆప్ ద్వారా మనకి అవసరమైన మెడిసిన్స్ ను ఉచిత డెలివరీ ద్వారా ఇంటికే సరఫరా చేసే సౌకర్యం కల్పించడం సంతోషించ దగిన విషయమన్నారు. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో మందుల కొనుగోలుకు మెడికల్ షాప్ లకు వెళ్ళ లేని వారికి సిరొనా ఫార్మసీ సంస్థ ముందుకు వచ్చి నందులకు జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాల ను తెలియ జేస్తున్నానన్నారు. సీరోనా ఫార్మసీ స్టార్టప్ కంపెనీ ప్రతినిధులు కిలపర్తి శివ శంకర్, ప్రత్యుమా లు మాట్లాడుతూ మధురవాడ నుండి గాజువాక పరిధిలో నివసిస్తున్న ప్రజలు మొబైల్ ఆప్ ను డౌన్ లోడ్ చేసుకొని వారికి అవసరమైన మెడిసిన్స్ కొనుగోలు కు ఆర్డర్ చేస్తే రెండు గంటల లోపుగా ఉచిత డోర్ డెలివరీ చేయడం జరుగుతుందన్నారు.. లాక్ డౌన్ వలన సీనియర్ సిటిజన్ లు, గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలు, నెలవారీ మెడిసిన్స్ వాడే వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మొబైల్ ఆప్ ను రూపొందించడం జరిగిందన్నారు.నగరంలో ప్రజలు ఈ అవకాశాన్ని ఉప యోగించుకోవల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమం లో సిరోన ఫార్మసీ ఆప్ టెక్నీషియన్ శ్రీ నీజ, ఇతర సభ్యులు హాజరయ్యారు.