ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఎపిఎంఎఫ్) ఉత్తరాంధ్ర కన్వీనర్ గా పి. ఈశ్వరరావు నియమితులయ్యారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ (ఎపిఎంఎఫ్) ఉత్తరాంధ్ర కన్వీనర్ గా పి. ఈశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఎపిఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.డిల్లీబాబురెడ్డి గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈశ్వర్ ప్రస్తుతం సివిఆర్ న్యూస్ ఛానల్ ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ గా విధులు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎపిఎంఎఫ్ పటిష్టతకు చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వులలో డిల్లీబాబురెడ్డి కోరారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఫెడరేషన్ తరపున సభ్యత్వ నమోదు, జిల్లా కమిటీల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎపిఎంఎఫ్ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కోసం ఎపిఎంఎఫ్ కృషి చేస్తోందని చెప్పారు. జర్నలిస్టులు ఎపిఎంఎఫ్ బలోపేతానికి సహకరించాలని ఈశ్వర్ కోరారు.