- ప్రతిగ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ మంత్రి ముత్తంశెట్టి
విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 09 భీమిలీ నియోజకవర్గంలో లోని అనందపురం , పద్మనాభం మండలాల్లో విస్తృతంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యటించారు. ఆయా మండల్లాలోని వెల్లంకి, ఇచ్చాపురం, చిన్నాయపాలెం, సిర్లపాలెం, పద్మనాభం ఎస్టీ కాలనీ, సామయవలస, పలు ప్రాంతాల్లో పర్యటించి.. కరోన నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలు..స్థానిక ప్రజలు సమస్యలను.. అడిగి మంత్రి వర్యులు తెలుసుకున్నారు. ఆనందపురం మండలాల్లో 4,65000 రూపాయలకు సంబందించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పలు మండలాల్లోని లబ్దిదారులకు అందించారు. అనంతరం పర్యటించిన ప్రతిగ్రామంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పెద్ద ఎత్తున స్థానిక ప్రజలకు బియ్యం , కందిపప్పు, కూరగాయలు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు అందించారు.