కరోనా కంటోన్మెంట్ జోస్ పై నిఘా కీలకమైనది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సహాని 

కరోనా కంటోన్మెంట్ జోస్ పై నిఘా కీలకమైనది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సహాని 


విశాఖపట్నం, ఏప్రిల్ 7: కోవిడ్-19 కట్టడి చేయడంలో కంటోన్మెంట్ జోన్ పై నిఘా కీలకమైనదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలం సహాని పేర్కొన్నారు . మంగళవారం ఆమె రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ కరోనా వ్యాప్తి 7 దశలలో వుంటుందన్నారు. మొదటి దశ నుండి 5వ దశ వరకు కంటైన్మెంట్ క్లస్టర్ పరిధిలో వ్యాప్తి చెందే అవకాశం వుంటుందని, 6,7 దశలతో బఫర్ జోన్ కు విస్తరిస్తుందన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది తో పాటు క్లస్టర్, జోనల్ అధికార్లు అప్రమత్తంగా మెలగుతూ వుండాలన్నారు. కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలకు పంపడం, క్వారంటైన్ కు తరలించడం యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. ఆలస్యమైతే తదుపరి దశకు వెళ్లే ప్రమాదం ఉందన్నారు. 13 జిల్లాల్లో 19 ఐసోలేషన్ ఆసుపత్రులు వున్నాయని, ప్రతి జిల్లాలో 2వేల క్వారంటైన్ పడకలు సిద్ధం చేయాలన్నారు. ంది కంటైన్మెంట్ క్లస్టర్లలో పూర్తి నిఘా జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టరు వినయ్ చంద్ మాట్లాడుతూ నగరంలో గుర్తించిన హాట్ స్పాట్ లలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వుంటున్నారని, శాస్త్రీయంగా తీసుకోవలసిన చర్యలన్నీ పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు.