ఉద్యోగులకు అభయం ఇచ్చిన Ntv చైర్మన్ చౌదరి

ఉద్యోగులకు అభయం ఇచ్చిన Ntv చైర్మన్ చౌదరి


కరోనా ప్రభావం పడని రంగం లేదు. దెబ్బ తినని వ్యవస్థ లేదు. ఇప్పుడు పైకి లాక్ డౌన్ లాగానే కనిపిస్తున్న ఈ ఉత్పాతం సృష్టించే విధ్వంసం ఊహకే భయపడుతుంది.కరోనా ప్రభావం అన్ని రంగాలతో పాటు మీడియా ను కూడా తీవ్ర అగాధం లోకి నెట్టి వేస్తుంది. దశాబ్దాలుగా ఉన్న సంస్థలు, వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థలు సైతం ఇప్పుడు జీతాల కోత, ఉద్యోగుల తగ్గింపు, కాస్ట్ కట్టింగ్ గురించి చర్చ మొదలు పెట్టాయి. ఆ మేరకు రంగం లోకి దిగాయి. అయితే Ntv గ్రూప్ చైర్మన్ నరేంద్ర చౌదరి మాత్రం ఇలాంటి సంక్షోభ సమయం లో సైతం కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ లో ఉన్న ఏ ఒక్క ఉద్యోగి తొలగింపు ఉండదని చెప్పారు. ఎవరి జీతాల్లో కోత పెట్టనని స్పష్టం గా మీటింగ్ పెట్టి మరీ ప్రకటన చేశారు. కార్పొరేట్ యాడ్స్, ఇతర ప్రకటనలు తగ్గి పోయి మీడియా యాజమాన్యాలు విలవిల లాడుతున్నాయి. ఇలాంటి సమయం లో జీతాల కోత ఉండదని చౌదరి గారు ఉద్యోగులకు స్పష్టం చేశారు. ఆర్థికం గా ఎంత క్లిష్ట పరిస్థితి ఉన్నా జీతాలకు ఇబ్బంది ఉండనివ్వనని చెప్పారు. ఎప్పుడు ఉద్యోగులను తగ్గిద్దామా, ఎప్పుడు కోతలు పెడదామా అని అంతా ఆలోచన చేస్తున్న సమయం....నష్టాన్ని తాను భరించి ఐన ఉద్యోగులకు కష్టాలు రానివ్వనని ఆయన చేసిన ప్రకటన ప్రసంశలు అందుకుంటుంది.


సాధారణ రోజుల్లో ఒక రోజు ముందుగానే ఉద్యోగికి జీతం అకౌంట్ లో వేసే Ntv యాజమాన్యం.....ఇప్పుడు ఈ ప్రకటనతో తన గొప్ప మనసును చాటుకుంది. ఉద్యోగుల పట్ల తమకు ఉన్న ఔదార్యం చాటుకున్నారు చౌదరి గారు. ఇలాంటి మనేజ్మెంట్ లు ఉంటే జర్నలిస్ట్ ల జీవితాలకు చీకట్లు దరిచేరవు. Ntv యాజమాన్యం చేసిన ఈ ప్రకటన ఇప్పుడు అన్ని వర్గాలలో, సంస్థలలో చర్చగా మారిపోయింది. ఉద్యోగి పనినే కాకుండా అతని కుటుంబాన్ని కూడా చూడగలిగిన మీ గొప్ప మనసుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు