నిత్యకైంకర్యాలు ఏకాంత సేవలుగా యధాప్రకారము
కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు
శ్రీదు ర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: దేవస్థానము నందు అమ్మవారికి మరియు స్వామివార్లకు జరుగు నిత్యకైంకర్యాలు అన్నియూ ఏకాంత సేవలుగా యధాప్రకారము ఆలయ అర్చకులు నిర్వహించడము జరుగుచున్నదని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబుతెలిపారు. దేశం లోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేవస్థానము నందు జరుగు నిత్య ఆర్జిత సేవలయందు భక్తులు ప్రత్యక్షముగా పాల్గొను అవకాశము లేనందు వలన అన్ని సేవలు ఆలయ అర్చకులుచే ఏకాంత సేవలుగా నిర్వహించబడుచున్నవి. భక్తుల సౌకర్యార్థము దేవస్థానము నందు జరుగు చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలు పరోక్షముగా భక్తుల గోత్ర నామముల తో జరిపించుటకు చర్యలు తీసుకొనుట జరిగినది. కావున ఈ పరోక్ష చండీ హోమము, లక్ష కుంకుమార్చన , శ్రీచక్రనవావర్ణార్చన, శాంతి కళ్యాణము సేవలు పరోక్షముగా జరిపించుకోనదలచిన భక్తులు టిక్కెట్లు online నందు www.kanakadurgamma.org – website ద్వారా పొందవచ్చునని ఆలయ కార్యనిర్వహణాధికారి వారు తెలిపియున్నారు.
దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించిన నేపధ్యములో విజయవాడ నగరంలో ఆహారం అందక ఇబ్బందులు పడుతున్న రోడ్లపై నివసిస్తున్న యాచకులు, పేద వారు మరియు ఇతరులకు ఆహారం అందించాలన్న ఉద్దేశముతో గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస రావు గారు, శ్రీయుత ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు మరియు గౌరవ ఆలయ పాలకమండలి చైర్మన్ శ్రీ పైలా సోమినాయుడు గారి ఆదేశాలానుసారం దేవస్థాన నిత్యాన్నదాన ట్రస్ట్ విభాగము ద్వారా ప్రతి రోజు కదంబం మరియు దద్దోజనం(పెరుగన్నం) ప్యాకెట్లు సురక్షిత వాతావరణంలో తయారు చేసిన అనంతరం ప్యాకింగ్ చేయబడి VMC వారి ద్వారా పంపిణీ చేయుట జరుగుచున్నదని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.వి.సురేష్ బాబు గారు తెలిపారు. ఈరోజు దేవస్థానం అన్నదాన విభాగము నందు జరుగుచున్న దద్దోజనం మరియు కదంబం యొక్క తయారీ మరియు ప్యాకింగ్ ను ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ MV సురేష్ బాబు గారు పరిశీలించారు. దేవస్థానం వారు జరుపు అన్నదాన కార్యక్రమమునకు విరాళాలు ఇవ్వదలచిన భక్తులు దేవస్థానం వారి వెబ్సైటు www.kanakadurgamma.org ద్వారా , లేదా eosdmsd@sbi అను BHIM UPI ద్వారా QR code ను స్కాన్ చేసి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా విరాళములు పంపవచ్చని కార్యనిర్వహణ అధికారి వారు తెలిపారు.