అక్కయ్యపాలెం లో ఆంక్షలను మరింత కఠినతరం పోలీసు అధికారులు
విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 09 కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని అక్కయ్యపాలెం ప్రాంతంలో గురువారం నుంచి ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు . ఈ మేరకు హై వే కూడలి నుండి దొండపర్తి జంక్షన్, రైల్వే న్యూ కాలనీ జంక్షన్ , తాటిచెట్ల పాలెం జంక్షన్ నుంచి అక్కయ్యపాలెం హై వే వైపు వెళ్లే అన్ని మార్గాలు చుట్టూ ఉన్న రోడ్లన్నీ కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించిన విషయం తెలిసిందే . ఇప్పటికే ఈ ప్రాంతంలో కేసులు వెలుగు చూస్తుండటంతో ఆ ప్రాంతవాసులు ఇంట్లోనే ఉండేలా ఇతరులకు అనుమతించకూడదని ,రాత్రుళ్ళు రోల్ కాల్ నిర్ణయించారు. ఈ మేరకు డిసిపి - 1 , ఎస్.రంగా రెడ్డి బుధవారం రాత్రి మహారాణి పార్లర్ జంక్షన్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు . ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని ఎసిపిలు, సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్ తో పాటు వార్డు వాలంటీర్లు, బందోబస్తు విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు నిర్వహించారు .
కాగా ఈ రోజు ఉదయం నుండి నిత్యావసర సరుకులు, కాయాగురలు, కూడా అందుబాటులో లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు . కేవలం పాలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు , అదీ నిర్దిష్ట సమయంలో మాత్రమే విక్రయాలు ఉన్నాయని ప్రజలు తెలిపారు . తమ నిత్యావసర సరుకుల దుకాణాలు కూడా తెరవని కారణం గా , కొంతమంది తెరిచినా పోలీసులు తో ఇబ్బందులు పడలేక మూసేస్తున్నారు . ఈ నేపద్యంలో సామాన్య ప్రజలకు వాలంటీర్లు అందుబాటులో లేక కొన్ని ఇళ్ళకు కూడా నిత్యావసర సరుకుల అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు . ఈ ప్రాంతంలో ఉన్న విలేకరులను కూడా బయటకు వెళ్లే వీలులేదని పోలీసులు చెబుతున్నారు . సర్వత్రా ప్రజల్లో ఈ దిగ్బంధంపై , కూరగాయల రైతు బజార్లు అందుబాటులో లేక , వెళ్ళనివ్వక పోవడంతో, నిత్యావసర సరుకుల లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాటికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.