ఫూలే చిత్రపటానికి పూలమాలలు;  జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి జ్యోతిరావు

ఘనంగా మహాత్మ  జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు


ఫూలే చిత్రపటానికి పూలమాలలు;  జిల్లా రెవెన్యూ అధికారి ఎం శ్రీదేవి జ్యోతిరావు


విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 11 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు ఫూలే 194 వ జయంతి వేడుకలను  జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి ఎం శ్రీదేవి జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ జ్యోతిరావు  ఫూలే కుల ,మత, వర్గ, వర్ణం తో సంబంధం లేకుండా అందరూ సమానమే అన్న దృక్పథం తో ముందుకు సాగారన్నారు. మహిళల స్థితిగతులను మెరుగుపరచడానికి అట్టడుగు వర్గాలు, పేద రైతుల అభ్యున్నతికి విశేష కృషి చేశారన్నారు. నిరుపేద నిరాశ్రయులకు అనాధ ఆశ్రమాన్ని, వయోజనుల కొరకు రాత్రి పాఠశాలను ఏర్పాటు చేసి వారికి విద్యాజ్ఞానాన్ని అందించారన్నారు. దోపిడీ వ్యవస్థ నుంచి అట్టడుగు ప్రజలను, అంటరాని తనం నుండి విముక్తి చేయడానికి నిరంతరం కృషి చేసిన మహనీయుడు జ్యోతిరావు ఫూలే  ఆదర్శనీయుడని ఆయనని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి శ్రీదేవి , కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి ఏ శ్రీనివాసరావు, కలెక్టర్ కార్యాలయ సూపరింటెండెంట్ లు,సిబ్బంది ,తదితరులు హాజరయ్యారు.