ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి
విశాఖపట్నం(అనకాపల్లి ) ఏప్రిల్ 29 : కరోనా వైరస్ కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి. మనల్ని మనమే కాపాడుకోవాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో ప్రతి ఇంటికి మూడు మాస్కులు అందజేసే ప్రక్రియలో భాగంగా బుధవారం ఉదయం అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ నియోజకవర్గంలో లక్ష మాస్కులను పంపిణీ చేయడం జరిగింది
ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ ఎవరికి వారే తమను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇలాంటి టైమ్ లో మాస్కులు దొరకవనే అభిప్రాయంతో ప్రభుత్వం మూడు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. కరణ వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరికి వారే స్వయంగా స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు