క్రిమి  సంహారక ద్వారాన్ని ప్రారంభించిన  ఎం పి ఎం వి వి 

ప్రజల ఆరోగ్యమే  ప్రభుత్య లక్ష్యం ఎంపి ఎం వి వి సత్యనారాయణ


ఎంవిపి  రైతు బజార్ లో క్రిమి  సంహారక ద్వారం ఏర్పాటు 



విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 12 రైతు బజార్లలో: జనసాంద్రత ఎక్కువగా ఉండడంతో   జిల్లా యంత్రాంగం  దృష్టిసారించి   ఏపీ రైతు బజార్ లో క్రిమి  సంహారక ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం నగరంలోని ఎంవిపి రైతు బజార్  క్రిమిసంహారక  ద్వారాన్ని మెంబెర్  ఆఫ్ పార్లమెంట్ ఎంవివి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవివి సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు రైతు బజార్ లో జన సాంద్రత ఎక్కువగా  ఉండడంతో ప్రధానంగా రైతుబజార్లో  క్రిమిసంహారక ద్వారాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎంవి సత్యనారాయణ తెలిపారు
అనంతరం రైతుల వద్దకు వెళ్లి  సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ ప్రారంభోత్సవ  కార్యక్రమంలో  ఈ కాలనీ సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖ రావు సబ్ ఇన్స్పెక్టర్ నారాయణ పాల్గొన్నారు