కరోనా వైరస్ సమయంలో ప్రతి రూపాయి విలువైనది గ్రీన్ క్లైమేట్ టీం, రత్నం 

కరోనా వైరస్ సమయంలో ప్రతి రూపాయి విలువైనది గ్రీన్ క్లైమేట్ టీం, రత్నం 



విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 11 కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ప్రతి రూపాయి విలువైనదిగా చూడగలరు. వృధా చేయవద్దు. లెక్కలేని తనంతో తినే ఆహారాన్ని పార వేయవద్దు. ఏ పంట పండించాలి అన్నా నెల రోజులనుంచి ఆరు నెలల పై పడుతుంది. అది మరచి మీరు ఆహారాన్ని వ్యర్ధం చేయవద్దని రత్నం సూచించారు ఎవరో దయతో, ధర్మంగా ఇస్తున్నారని మీరు లెక్క చేయకుండా నాశనం చేసుకుంటే అందరూ నష్టపోతారు అన్నది గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ పంట పండించడానికి జనం ముందుకు రావడం లేదు. ఒకవైపు భారీ వర్షంతో చాలా చోట్ల పంట నష్టం ఏర్పడింది. మరో వైపు రానున్న మండు వేసవిని దృష్టిలో లోనికి తీసుకొని ఎవరు విత్తనాలు వేయడానికి ముందుకు రావడం లేదు. ఇది మనం గుర్తుంచుకోవాలి.  కరోనా వైరస్ నేతృత్వంలో అవసరం అయిన వారికి మాత్రమే అన్నం పెట్టండి.  స్వగ్రామాలను విడిచి, రేషన్ లేక, దిక్కుతోచక విలపిస్తున్న వారిని ఆదుకోండి.ఇల్లు అద్దె కట్టుకోలేక, బతకడానికి వేరే దారి లేని వారిని ఆదుకోండి.నిన్నటివరకు గౌరవంగా జీవించినవారు నేటి పరిస్థితులు తట్టుకోలేక, వేరొకరిని అడగలేక ఆకలితో మృత్యువాత పడకుండా మనమే ఆదుకోవాలి, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలి, గమనించండి. కరోనా వైరస్ విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి. మన చుట్టూ ఉన్నవారు కూడా అప్రమత్తంగా ఉండేలా ఎవరికీ వారే జాగ్రత్త లు తీసుకోవాలని రత్నం విజ్ఞప్తి చేశారు