రేషన్ కార్డులు లేని జర్నలిస్టులకు బియ్యం కందిపప్పు ; జేసీ శివశంకర్

రేషన్ కార్డులు లేని జర్నలిస్టులకు బియ్యం కందిపప్పు ; జేసీ శివశంకర్


విశాఖపట్నం వారధి న్యూస్ ఏప్రిల్ 11 రేషన్ కార్డు లేని ప్రతి జర్నలిస్టులకు ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో  ఎపిడబ్ల్యుజెఎఫ్ ప్రతిపాదన మేరకు వారికి బియ్యము కంది పప్పు అందించడం జరిగిందని జాయింట్ కలెక్టర్ ఎల్ శివ శంకర్ తెలిపారు  సీతమ్మధారలోని నార్ల వెంకటేశ్వరరావు భవన్ ఆవరణలో ఏర్పాటుచేసిన  ఈ కార్యక్రమంలో  ఆయన మాట్లాడుతూ కరోనాతో ప్రజలు విలవిల్లాడుతున్నారని ఈ సమయంలో జర్నలిస్టులు అందిస్తున్న సేవలు నిరుపమానమని అన్నారు. జర్నలిస్టుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రైస్ మిల్లర్ల సహకారంతో రేషన్ ను అందజేశామని చెప్పారు.ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్  శివశంకర్ స్పందించిన తీరు అభినందించదగ్గ పరిణామం అన్నారు ఇప్పటికే సొంత నిధులతో నా వంతు సహకారం జర్నలిస్టులకు రేషన్ సరుకులు ఇవ్వడం జరిగిందన్నారు నగర అధ్యక్షులు పి నారాయన్  మాట్లాడుతూ జర్నలిస్టుల కోరికను మన్నించి రేషన్ అందజేసిన జాయింట్ కలెక్టర్ శివ శంకర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు  ఈ కార్యక్రమంలో జిల్లా డి డి మణిరామ్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్ నగర అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు,  ఫెడరేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డీ.  రవికుమార్ ఉపాధ్యక్షులు   శివప్రసాద్,  జాతీయ సభ్యులు జీ. శ్రీనివాస రావు, ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నగర సభ్యులు , బొప్పన రమేష్,  కే. మురళి కృష్ణ ,పెనుమత్స శ్రీహరిరాజు  ఏఎస్వో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.